మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న ఈ సినిమా బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..
ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!
అదే తేదీన తలైవా రజనీకాంత్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే వార్ 2 మాత్రం ప్రమోషన్లలో వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.. దీనితో పూర్తి ప్రమోషన్స్ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ కూడా చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని సమాచారం.ఈ నెల 23 న ఈ సినిమా ట్రైలర్ఇ రిలీజ్క చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అయితే సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను ప్రమోట్ చేసే భాద్యత హృతిక్ రోషన్ తీసుకున్నట్లు సమాచారం.
