MOVIE NEWS

యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!!

తమిళ్ స్టార్ హీరో కార్తీ, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ `యుగానికి ఒక్కడు` అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఉండేది..ఈ భారీ సినిమా తమిళ్ ప్రేక్షకులు కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. నటుడిగా కార్తీకి ఈ సినిమా మూడవ చిత్రం.. మూడవ సినిమాతోనే కార్తీ తన కెరీర్ లో భారీ ప్రయోగం ప్రయోగం చేసాడు.అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో కార్తీ ఎంతో టెన్షన్ పడ్డాడట..

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమా సక్సెస్ అవుతుందా.. లేదా అనే సందేహంతోనే మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేశారట.కానీ కోలీవుడ్ ను మించి టాలీవుడ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది..ఈ సినిమాతోనే కార్తీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాడు. దర్శకుడిగా సెల్వరాఘవన్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేక్షకులకు యుగానికి ఒక్కడు మూవీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది….ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది..

ఇదిలా ఉంటే ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.. మార్చి 14 న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. సినిమాలోని హైలైట్ సీన్స్ తో ఈ ట్రైలర్ ని కట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

Related posts

ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..?

murali

ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

Leave a Comment