మల్టీస్టారర్స్ సినిమాలకి ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఏర్పడింది.. స్టార్ హీరోలు సైతం ఎలాంటి ఈగో లు లేకుండా కథ బాగుంటే ఎలాంటి పాత్ర కైనా ఓకే చెప్పేస్తున్నారు.. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం, లేదా ఒక హీరో సినిమాలో ఇంకో హీరో గెస్ట్ అప్పీరెన్స్, రోల్ చేయడం వంటివి చేస్తున్నారు.ఇప్పుడు ఇదే కోవలోకి ఇద్దరు స్టార్ హీరోలు చేరిపోయారు.. తమిళ్ స్టార్ హీరోస్ ధనుష్, కార్తీ కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన యుగానికి ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాలో కార్తీ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కొన్నేళ్ల క్రితమే సెల్వ రాఘవన్ ప్రకటించారు..
అల్లుఅర్జున్,అట్లీ మూవీ బిగ్ అనౌన్స్మెంట్..ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!
అయితే సీక్వెల్ లో మెయిన్ హీరో ధనుష్ అని తెలిపాడు… యుగానికి ఒక్కడు సినిమా క్లైమాక్స్ లో కార్తీ.. రాజు కొడుకు ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడు పెద్దయిన తర్వాత నుంచి ఈ సీక్వెల్ కథ ఉంటుందని ఆయన చెప్పారు.యుగానికి ఒక్కడులో కార్తీ మెయిన్ లీడ్ కాబట్టి సీక్వెల్ లో కంటిన్యుటీ కోసం కార్తీ కూడా కొన్ని సీన్స్ లో ఉంటాడని, ధనుష్ మాత్రం మెయిన్ లీడ్ లో నటిస్తాడు అని సమాచారం.. ధనుష్,కార్తీ లాంటి స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.. వీరిద్దరికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అదిరిపోయే మార్కెట్ ఉంది. దీనితో ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
తాజాగా సెల్వ రాఘవన్ యుగానికి ఒక్కడు సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.యుగానికి ఒక్కడు సీక్వెల్ తీస్తాను. కానీ త్వరగా అనౌన్స్ చేసాము అనిపిస్తుంది. ధనుష్ తోనే సినిమా చేస్తాను. కార్తీ కూడా సినిమాలో ఉంటాడు. కానీ అంతటి భారీ ప్రాజెక్ట్ కి మంచి ప్రొడ్యూసర్ కావాలి.అంతే కాదు సినిమా చేసే ఆర్టిస్ట్ లవి ఒక సంవత్సరం పాటు డేట్స్ కావాలి. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు..