MOVIE NEWS

నిన్న వెంకీ మామతో.. నేడు మెగాస్టార్ తో.. అనిల్ ప్లాన్ అదిరిందిగా..!!

మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. వింటేజ్ మెగాస్టార్ నీ చూపిస్తాను అంటూ అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసాడు.. ఈ సినిమాను ఈ ఉగాది సందర్బంగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు..గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.. ఈ సినిమా ఆద్యంతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథాంశం తో రాబోతుంది..

మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన పరిణితి చోప్రా,అదితి హైదరీ హీరోయిన్స్ గా నటించనున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో మెగాస్టార్ రా ఏజెంట్ ‘శివ శంకర వరప్రసాద్’ కనిపించనున్నట్లు సమాచారం..ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటల ట్యూన్స్ సిద్ధం కావడం మిగిలిన రెండు పాటలపై వర్క్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అయితే, ఈ సినిమాలో ఒక పాటను స్వయంగా మెగాస్టార్ చిరంజీవితో పాడించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ గతంలో కూడా కొన్ని పాటలు పాడగా అవి విశేష ప్రేక్షకాధారణ పొందాయి.. దీనితో ఈ సినిమాలో కూడా అంతకు మించి ఉండేలా ఒక స్పెషల్ సాంగ్ రూపొందిస్తున్నట్లు సమాచారం..అనిల్ తన రీసెంట్ బ్లాక్ బస్టర్ “ సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో కూడా వెంకీ మామ తో పాట పాడించి సూపర్ హిట్ అందుకున్నాడు.. దీనితో మెగాస్టార్ తో మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు..

Related posts

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!!

murali

Leave a Comment