ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి.. నిర్మాణ సంస్థలకు ఈ రీ రిలీజ్ ట్రెండ్ బాగా కలిసొస్తుంది..ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో దానికంటే రెండు రోజుల ముందు మే 18న యమదొంగ మూవీని మేకర్స్ రీ రీలీజ్ చేస్తున్నారు. మే 19, 20వ తేదీల్లో సినిమా థియేటర్లలో ఆడబోతోంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు 2007 ఆగస్టు 15న వచ్చిన ఈ బిగ్గెస్ట్ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.. అప్పట్లో ఈ మూవీ భారీ విజయం సాధించింది.
బిగ్ అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేసిన దిల్ రాజు..!!
ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యముడి పాత్రలో నటించారు. అప్పటి వరకు ఎంతో బొద్దుగా వున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సన్నగా మారి తన పూర్తిగా లుక్ ని మార్చేసి ఈ సినిమాతోనే మరోసారి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ ప్రియమణి హీరోయిన్ గా నటించింది. చిరంజీవి, ఊర్మిళ గంగరాజు నిర్మించిన ఈ సినిమాను. మైత్రీ మూవీ మేకర్స్ రీ రిలీజ్ చేస్తోంది.
ఈ సినిమాను 4కే ప్రింట్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నారు. అప్పట్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ లో సైతం రికార్డులు సృష్టిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు..పేజీలకు పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పి తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు డాన్స్ మూమెంట్స్ తో కూడా ఎన్టీఆర్ అదర గొట్టాడు…ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..