టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది రామ్ నటించిన “ డబుల్ ఇస్మార్ట్ “ ప్లాప్ అయింది.. తన కెరీర్ ను మలుపు తిప్పే మాస్ ఇమేజ్ కోసం రామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. కానీ రామ్ కు లక్ మాత్రం కలిసి రావడం లేదు.. ప్రస్తుతం రామ్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కిస్తుంది..”RAPO22” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబుఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ కి ఇది 22వ సినిమా కావడం విశేషం..
ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..?
ఈ సినిమాలో హీరో రామ్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 15 జరిగే ఈ షూట్ లో కీలకమైన సీన్స్ తెరకెక్కించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ రైటర్ గా మారాడు. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడట. పాట కూడా చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ప్ ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
గతంలో కూడా రామ్ కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లో సైతం తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఇప్పుడు లిరిక్ రైటర్ గా రామ్ తనలోని మరో టాలెంట్ ని బయట పెట్టాడు.. ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..