మెగాస్టార్ చిరంజీవి భారీ హిట్ అందుకొని చాలా కాలమే అయింది..ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోవాలనుకుంటున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్” సినిమా కోసం ఈ సినిమాని వాయిదా వేశారు.
హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్..
అలాగే ఈ సినిమాను వాయిదా వేసేందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్… విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది.. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి టీం పని చేస్తోంది. సినిమా కథాపరంగా బాగుందని విజువల్స్ పరంగా కూడా చాలా కేర్ తీసుకోవాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎంత ఆలస్యమైనా పర్లేదు మంచి అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది..ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాటి షూటింగ్ కూడా పూర్తి చేసారు. షూటింగ్ ఇంకొంత భాగం మిగిలి ఉండడంతో త్వరగా షూటింగ్ పూర్తి చేసి కంప్యూటరైజ్డ్ గ్రాఫిక్స్ తో కూడిన బెస్ట్ ఔట్ పుట్ ని ప్రేక్షకులకి అందించాలని మేకర్స్ భావిస్తున్నారు..