MOVIE NEWS

‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల పుటేజ్ ని యాడ్ చేసి ఈ సినిమా రీ లోడెడ్ వెర్షన్ ను జనవరి 17 న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ రీ లోడెడ్ వెర్షన్  కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనేదానికి మిస్ అయిన లాజిక్ కి క్లారిటీ ఇచ్చారు..ప్రస్తుతం ఈ సినిమాపై సెలబ్రిటీలు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే లక్ష్యంతో పుష్ప 2 సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.ఇక ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి మూడో పార్టుని త్వరగా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

పుష్ప 3 సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబు నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే పుష్ప రాజ్ తన తమ్ముడిని అలాగే తమ్ముడి కొడుకుని చంపాడు కాబట్టి అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి పుష్ప కి యాంటీ గా వున్న అందరిని ఒక చోటుకి చేరుస్తాడు. దీనిని బట్టి పుష్ప 3 సినిమా కూడా చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ముఖ్యంగా అల్లు అర్జున్, జగపతి బాబు మధ్య టగ్ ఆఫ్ వార్ గా ఈ సినిమాను నడిపించబోతున్నారని సమాచారం.

Related posts

హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..?

murali

మహేష్ సినిమా కోసం రంగంలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్.. జక్కన్న ప్లానింగ్ అదిరిందిగా..!!

murali

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

Leave a Comment