MOVIE NEWS

ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..?

టాలీవుడ్ లో మంచు వారింట రచ్చ హాట్ టాపిక్ గా మారింది..మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తగాదాలు బయటపడ్డాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే మంచు హీరోలు ఈ సారి ఏకంగా కొట్టుకోవడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనపై, తన భార్యపై అనుచరులతో దాడి చేయించాడని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు..

పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?

నిన్న అంతా మంచు మనోజ్‌ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దృశ్యాలు వైరల్ అవగా తాజాగా మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్ట్ లో వెల్లడిఅయింది.. మంచు మనోజ్ కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్ తనపై దాడి చేసాడని మోహన్ బాబు కూడా కేసు పెట్టారు.తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వైరల్ అవుతుంది.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ముదురుతుంది. ఈ తెల్లవారుజామున జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ రావడం జరిగింది..

మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను ఆయన తీసుకెళ్లాడు. రెండు రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అలాగే ప్రైవేట్ బౌన్సర్లు కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉంటున్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని సమాచారం. గతంలో ఓ సారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు వెళ్లి దాడి చేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే..దీనితో ఈ గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలి..

Related posts

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..!!

murali

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

murali

Leave a Comment