MOVIE NEWS

ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత దర్శకుడు కొరటాల శివ టేకింగ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. కేవలం కొన్ని ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ రాసుకొని, సినిమాని చుట్టేశాడని ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఈ సినిమా పార్ట్ 2 కూడా అవసరం లేదని చాలా మంది అభిమానులు కామెంట్లు చేశారు.

పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!!

అయితే ‘దేవర’ పార్ట్ 2 మూవీని ఈ ఏడాదిలో సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ కొరటాల శివ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు..తాజాగా ‘దేవర’ పార్ట్ 2 స్టోరీ ఇదేనంటూ ఓ కథ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.యాక్టర్ అజయ్ ఎవరిని నుంచి వెతుక్కుంటూ ఎర్ర సముద్రం వరకూ వచ్చాడో ఆ యతి, ప్రకాశ్ రాజే అని అజయ్ వెతుక్కుంటూ వచ్చి ప్రకాశ్ రాజ్ దగ్గరే ఆగాడు.. దేవరని అతని కొడుకు వర చంపినట్టుగా యతి చెప్తాడు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.దేవర చనిపోడు. బతికే ఉంటాడు…

ఇంటర్వెల్ ఫైట్ తర్వాత తీవ్రంగా గాయపడిన దేవరని ఓ కోస్టల్ గార్డ్ వచ్చి కాపాడతాడు. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లే వారి వీపులపై X మార్క్ వేసేది కూడా దేవరనే.. ఫస్ట్ పార్ట్‌లో యతి చెప్పింది అంతా కట్టు కథే అని .. నిజానికి దేవర, వర మధ్య సీన్స్ పార్ట్ 2లో హైలైట్‌గా ఉంటాయని .. రెండో పార్ట్‌లో వచ్చే ట్విస్టులు చూసి షాకవుతారంటూ ఓ అభిమాని చెప్పిన పార్ట్ 2 స్టోరీ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..

Related posts

తమన్ మాటలకు చిరూ రియాక్షన్.. ట్వీట్ వైరల్..!!

murali

పరుశురాం నెక్స్ట్ హీరో అతనేనా….

filmybowl

ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!!

murali

Leave a Comment