MOVIE NEWS

బ్లాక్ బస్టర్ ” ఛావా” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..?

ఇటీవల గ్రాండ్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛావా” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కింది..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు.. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందీ.

RRR : ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కి రెండేళ్లు.. టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వసూళ్లు అందుకోవడంతో ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.దీనితో ఈ సినిమాకు తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను మార్చి 7న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసింది.. తెలుగులో ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ.10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది…ఇక ఫైనల్ రన్ లో ఈ మూవీ రూ. 15 కోట్ల మార్క్‌ కలెక్షన్స్ సాధించనున్నట్లు అంచనా వేస్తున్నారు..

ఇదిలా ఉంటే ఛావాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఛావా సినిమా ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందనే న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై నెట్ ఫిక్స్ నుంచి అధికారిక ప్రకటన చేయాల్సి వుంది..

 

Related posts

యానిమల్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!!

murali

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పిరిట్ టీం బంపర్ ఆఫర్..!!

murali

ఎన్టీఆర్ పోస్ట్ కు బ్రహ్మీ ఫన్నీ రిప్లై.. ఈ ఫీలింగ్ ఏంట్రా చారి..!!

murali

Leave a Comment