దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే సొంతం..ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతి సారి ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి.రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది..ఈ సినిమాతో ఇండియన్ సినీ హిస్టరీలో ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ సాధించి ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరారు..
తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు.. దీంతో రాజమౌళి సినిమా అంటే ఎంత బడ్జెట్ పెట్టడానికి అయినా సరే నిర్మాతలు పోటీ పడుతున్నారు..రాజమౌళి తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాజమౌళి చాలా బిజీబిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో రాజమౌళి గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. మిగిలిన దర్శకుల కంటే అయితే క్రియేటివ్ గా సీన్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న ఎప్పుడు ముందు వుంటారు..కానీ రాజమౌళి సినిమా విషయంలో ఆ ఒక్కటే తక్కువవుతుంది..అదే సొంత కథతో సినిమా చేయకపోవడం.
రాజమౌళి సినిమా చేయాలంటే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాల్సిందే. ఇప్పటి వరకూ రాజమౌళి సొంత కథతో ఒక్క సినిమా కూడా లేదు. తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కి స్టోరీ అందించింది పృథ్వీరాజ్. ఆ తర్వాత తెరకెక్కించిన సింహాద్రి,సై,ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి,ఆర్ఆర్ఆర్ వరకూ అన్ని సినిమాలకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ లను అందించారు. మధ్యలో ఈగ సినిమాకి మాత్రం విజయేంద్ర ప్రసాద్ కేవలం కాన్సెప్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది..
ఆ కథని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం రాజమౌళి. అలాగే మర్యాద రామన్న కు ఎస్. ఎస్ కాంచి స్టోరీ ఇచ్చారు. ఆ కథను కూడా రాజమౌళి తనదైన శైలిలో మలిచారు .అలా ఆ రెండు సినిమాల పరంగా రాజమౌళి స్టోరీ రైటింగ్ లో పనీ చేసారు. సొంత కథతో సినిమా తీసే దర్శకుల జాబితాలో రాజమౌళి ఎప్పుడు చేరతారో చూడాలి..