MOVIE NEWS

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది..పుష్ప 2 సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..పుష్ప 2 మూవీ ఓవరాల్ గా ఈ మూడు రోజుల్లో ఏకంగా 621 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ ను కండక్ట్ చేశారు.

పుష్ప 2 సినిమాలో అసలు కథ కంటే అల్లు అర్జున్ ఎలివేషన్ మీద సుకుమార్ దృష్టి పెట్టినట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.. పార్ట్ 3 లో అయినా ఈ స్టోరీకి ముగింపు ఇస్తారో లేదో చూడాలి.పుష్ప 3 ర్యాంపేజ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి వుంది … అయితే ఈ సినిమా మరో మూడు సంవత్సరాల తర్వాత సెట్స్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్  కూడా త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సినిమాలు అన్ని ముగిసి ఫ్రీ అయిన తర్వాతే పుష్ప 3 సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే పుష్ప రెండు పార్టులు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాన్ ఇండియా వైడ్ అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది.. అల్లు అర్జున్ తరువాత నటించబోయే సినిమాకు గ్లోబల్ వైడ్ కళ్ళు చెదిరే మార్కెట్ లభిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ నీ మార్చేసింది..

Related posts

Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..?

murali

RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.?

murali

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

murali

Leave a Comment