What's next from chandu mondeti
MOVIE NEWS

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

What's next from chandu mondeti
What’s next from chandu mondeti

chandu mondeti : చందూ మొండేటి కార్తికేయ అనే సినిమా తో తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా ఏదిగాడు. మధ్యలో సవ్య సాచి ఒక్కటి తేడా కొట్టిన మిగిలిన అన్ని చిత్రాల్లో చందు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం నాగ చైతన్య హీరో గా ‘తండేల్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. డిసెంబ‌రు, కానీ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

‘తండేల్‌’ త‌ర‌వాత చందూ నెక్ట్ ఎవరితో…. ఏ సినిమా చేయబోతున్నాడు అనే విష‌యాల‌పై ఈ మధ్యే ఓ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. తన తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయ‌బోతున్నానని చెప్పాడు.

అయితే.. ఈ సారి ఇంకాస్త పెద్ద స్పాన్ వున్న కథతో, ఓ బాలీవుడ్ స్టార్ తో జ‌త కట్టబోతున్నట్టు తెలుస్తుంది.

కార్తికేయ2 తర్వాత ఆ సదరు బాలీవుడ్ స్టార్ చందూ తో సినిమా కి రెడీ అయ్యాడు. కానీ ముందు వున్న కమిట్మెంట్ కోసం చందు చైతు తో సినిమా మొదలుపెట్టాడు. అందుకే గీత ఆర్ట్స్ కూడా చందు తో నెస్ట్ సినిమా చేయడానికి రెడీ అయింది.

సో టాపిక్ కి వెళ్తే చందు ద‌గ్గ‌ర ఓ పిరియాడిక‌ల్ డ్రామా కథ ఉంది. దాన్ని బాలీవుడ్ లో ఓ పెద్ద హీరోతో జాత కట్టలని గీతా ఆర్ట్స్ ప్లాన్. బ‌డ్జెట్ కూడా పెద్ద మొత్తంలోనే కర్చుబెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

‘తండేల్‌’ పూర్తవ్వగానే దర్శక నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నీ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్‌నీ పట్టలెక్కించనుందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మాట. తండెల్ ముగింపు నాటికి ఈ సినిమాకు సంబంధించిన డిటైల్స్ తెలుస్తాయి అంటున్నారు.

గీతా ఆర్ట్స్ అంటేనే భారీ సినిమాల ప్రొడక్షన్ హౌస్ కానీ ఈమ‌ధ్య ఎందుకో భారీ చిత్రాల‌పై వైపు వెళ్ళడం లేదు. చిన్న‌, మీడియం సైజు సినిమాల‌ తో సరిపెట్టుకుంటుండ్.

Read Also :  అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ !

జీఏ 2 అని ఒక సంస్థ స్థాపించి ఈ మీడియం సైజు సినిమాలు తీస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి గీతా ఆర్ట్స్ మ‌ళ్లీ యాక్టీవ్ అవ్వనుంది.

‘తండేల్‌’ నుంచి గీత ఆర్ట్స్ వ్యూహం మార్చింది. చైతు కెరీర్‌లోనే ‘తండేల్‌’ ఒక భారీ బ‌డ్జెట్ సినిమా. అది కూడా వరసగా ఫ్లాప్స్ ఎదుర్కుంటునప్పుడు ఈ సినిమా చైతు కి దొరకడం లక్కీ అనే చెప్పాలి.

ఇప్పుడు ఇక చందూ మొండేటితో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం. దాంతో పాటు అన్ స్టాప్పబుల్ హీరో నందమూరి బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక వాళ్ళ ఇంటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయిక లో ఓ సినిమా ప్రారంభం అవుతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే. ఇందులో గీతా ఆర్ట్స్ భాగ‌స్వామి.

ఈ సినిమాల జోరు చూస్తుంటే, గీత ఆర్ట్స్ కి పూర్వ వైభవం రాబోతుంది అని అర్థం అవుతుంది అలాగే ఇండస్ట్రీకి కూడా మంచి సినిమాలు వస్తాయి అని అనిపిస్తుంది

Follow us on Instagram

Related posts

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!!

murali

Leave a Comment