MOVIE NEWS

రాజమౌళి చెప్పిందే నిజమైంది.. ఇక నుంచి అసలైన బాక్సాఫీస్ వార్ షురూ..!!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది..బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పాన్ ఇండియా వైడ్ రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది..అయితే కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి టాలీవుడ్ లో తనకు పోటీనిచ్చే దర్శకులు ఎవరో తెలియజేసారు.. టాలీవుడ్ లో తనకి పోటీనిచ్చే దర్శకులు ఇద్దరున్నారని వారు కనుక కాన్సర్ట్రేషన్ చేసి మాస్ సినిమాలు తీస్తే నేను ఇంక సర్దుకోవాల్సిందే అని రాజమౌళి తెలిపారు..

రాజమౌళి తెలిపిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మొదటి నుంచి ఎక్కువగా క్లాస్ కంటెంట్ సినిమాలు తీస్తూ వస్తున్నారు.సుకుమార్ తెరకెక్కించిన జగడంలాంటి డార్క్ మాఫియా డ్రామాలో ఇంట్రో సీన్ ని జక్కన్న విపరీతంగా ఇష్టపడతారు. అందరూ వెనక్కు వెళ్తుంటే రౌడీ మూకకు రామ్ ఒక్కడే ఎదురు వెళ్లే షాట్ రాజమౌళికి తెగ నచ్చేసింది… కానీ ఆర్య నుంచి నాన్నకు ప్రేమతో వరకు సుకుమార్ క్లాస్ మూవీస్ తెరకెక్కించాడు..రంగస్థలంతో రూటు మార్చడమే కాదు కమర్షియల్ పల్స్ మీద తన పట్టుని నిరూపించుకున్నారు.

అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ తాజాగా పుష్ప 2 సినిమాతో అంతకు మించి క్రేజ్ సంపాదించుకున్నారు.. పుష్ప 2 సినిమా ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది.దీనితో గతంలో రాజమౌళి చెప్పిందే నిజమైంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. దర్శకుడు సుకుమార్ ఫాంటసీ టచ్,భారీ విజువల్స్ టెక్నికల్ హంగులు లాంటివి ఏమి లేకుండా కేవలం ఒక ఎర్రచందనం దొంగ కథతో టోటల్ ఇండియా రికార్డులు కొల్లగొట్టడం మాములు విషయం కాదు. బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చయినా కూడా ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తీయడం మాత్రం చాలా గొప్ప విషయం. అల్లు అర్జున్ కి జాతీయ అవార్డుతో పాటు తన కెరీర్ లో నిలిచిపోయే సినిమాలను సుకుమార్ అందించారు..

Related posts

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

murali

లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన.

filmybowl

బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!!

murali

Leave a Comment