యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “పెళ్లి సందD”:సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ సినిమాలో తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ సినిమా అంతగా మెప్పించకపోయిన శ్రీలీలకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది..ఈ భామ రవితేజ హీరోగా ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. ఆ సినిమా లో ఈ అమ్మడి డాన్స్ తో అదరగొట్టేసింది..శ్రీలీల డాన్స్ మూమెంట్స్ థియేటర్ లో ఫ్యాన్స్ చేత ఊర మాస్ స్టెప్స్ వేయించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి..
పుష్ప 2 : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!
రామ్ తో స్కంద, మహేష్ తో గుంటూరు కారం, నితిన్ తో ఎక్సట్రార్డినరీ మ్యాన్, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ వంటి సినిమాలు చేసింది.. అయితే ఇలా వరుస సినిమాలు చేసిన ఈ భామకు వరుస షాక్ లు తగిలాయి.. ఒక్క గుంటూరు కారం మినహా మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే ఈ సినిమాలన్నిటీలో కూడా శ్రీలీల తన డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టింది..దీనితో ఈ భామకు డాన్సింగ్ క్వీన్ గా మంచి పేరొచ్చింది.. ప్రస్తుతం ఈ భామ చేతిలో నితిన్ రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రమే వున్నాయి.. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ లో ఐటమ్ సాంగ్ చేసింది..
తాజాగా రిలీజ్ అయిన “కిస్సిక్’ అనే ఐటమ్ సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సాంగ్ లో శ్రీలల అల్లుఅర్జున్ తో కలిసి మాస్ స్టెప్స్ వేసి ఎంతగానో అలరించింది.. ఇదిలా ఉంటే తాజాగా నితిన్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు . ఇందులో శ్రీలీలకి రాబిన్ హుడ్ సినిమా కన్నా కూడా పుష్ప 2 సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి .టాలీవుడ్ డాన్స్ క్వీన్ గా మంచి పేరు పొందారు.. అయితే టాలీవుడ్ లో డాన్స్ కింగ్ ఎవరు అంటూ ప్రశ్నలు అడిగారు.. శ్రీ లీల వెంటనే నా దృష్టిలో అల్లు అర్జున్ సార్ డాన్స్ కింగ్ అంటూ చెప్పేసింది”.దీనితో రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్రీలీల ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు..