MOVIE NEWS

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తునే వున్నారు.. మూడేళ్ళ నిరీక్షణ తరువాత అల్లు అర్జున్ నుంచి మూవీ వస్తుంది..వరుస వాయిదాల తరువాత మేకర్స్ ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించారు.. రిలీజ్ కి నెల రోజుల ముందుగానే పుష్ప ఫీవర్ మొదలైంది.. బీహార్ రాజధాని పాట్నా లో మొదలైన పుష్ప ప్రమోషన్ బ్రేకులు లేని బండిలా దూసుకుపోతుంది..

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టాయి.. ఇదిలా ఉంటే  పుష్ప 2 నుంచి తాజాగా 4వ సాంగ్ .. “పీలింగ్స్” లిరికల్ వీడియో రిలీజ్ అయింది..మలయాళ లిరిక్స్తో మొదలైన ఈ సాంగ్ ఒక్కసారి వినగానే ఎక్కేసింది..ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ మాములుగా లేదు.. అలాగే సాంగ్ విజువల్స్ సైతం అదిరిపోయాయి…ఇక సాంగ్ కి తగ్గట్టు అల్లుఅర్జున్, రష్మిక మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసాయి.. ఈ సాంగ్ చూసాక ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతలో వున్నారు..

అయితే పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు..డ్యాన్స్ లో రష్మిక, అల్లుఅర్జున్ ఒకరికొకరు పోటీపడి చేసారు.. నవంబర్ 27న కొచ్చి ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మలయాళ ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని తెలిపారు.ఇందులో భాగంగానే మలయాళ ప్రేక్షకులకు కోసం ఓ సాంగ్ అన్ని భాషల్లోనూ ఉంటుందని.. తనని సొంత బిడ్డలా ఫీల్ అయ్యే మలయాళం అభిమానులకు ఇది మా నుంచి చిన్న ట్రిబ్యూట్ అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ గా మారింది..

Related posts

వెంకీ మామ లా మారిన ఆ క్యూట్ హీరోయిన్.. చంటి గెటప్ అదిరిందిగా..!!

murali

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!!

murali

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

filmybowl

Leave a Comment