MOVIE NEWS

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు వస్తున్న “ తండేల్ “ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ విన్నా తండేల్‌ సాంగ్సే వినిపిస్తున్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..

మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన తండేల్ మూవీ ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసుభారీ స్థాయిలో నిర్మించాడు..ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇదిలా ఉంటే “ తండేల్ “ ఫలితంపై గీతా ఆర్ట్స్ ఎంతో ధీమాగా ఉంది.ఈ సారి భారీ హిట్ కొట్టబోతున్నట్లు తెలిపింది..

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం..అంటూ రికార్డింగ్ రూమ్ లో దేవిశ్రీప్రసాద్ దర్శకుడు చందూ మొండేటి డాన్స్ వీడియోను షేర్ చేసింది..ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ సినిమా సక్సెస్ పై దేవిశ్రీప్రసాద్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.. గతంలో తన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ రాగా ఈ సినిమాతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నాడు.. ఈ సినిమా సక్సెస్ అయితే దేవిశ్రీ రేంజ్ ఏంటో అందరికి తెలుస్తుంది.. ఇప్పటికే ప్రివ్యూ షో చూసిన వారంతా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

 

Related posts

‘కాంతారా2’లో…. మరో స్టార్ హీరో…. ఎవరంటే????

filmybowl

SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..?

murali

హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment