మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..’దేవర’ సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ వార్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “వార్ 2” సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయనను ఢీకొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం..
ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!!
బ్రహ్మస్ట్ర మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే ఒక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది.వీరేంద్ర రఘునాథ్ సౌత్ ఇండియా నుంచి వచ్చి రీసెర్చ్ అనాలసిస్ వింగ్ లో జాయిన్ అయిన ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.అయితే అదే రీసెర్చ్ అనాలసిస్ వింగ్ లో ఉన్న కొందరు తనను మోసం చేశారని భావించి మొత్తం ‘రా’కే ఎదురు తిరుగుతాడు.
ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ తో ఢీ కొట్టాల్సిn పరిస్థితి వస్తుంది..హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది…ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మొట్ట మొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇప్పటి వరకు ఆయన చేసిన పలు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి కానీ నేరుగా హిందీ సినిమా చేయడం ఇదే మొదటి సారి…దీనితో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి..