War War2 Kaanthara2 : ఈ సంవత్సరం లో ఇంకా ఒక పాన్ ఇండియా సినిమా పుష్ప 2 రిలీజ్ కావాల్సి ఉంది ఆ చిత్రం కోసం అందరు ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు.
ఇక వచ్చే సంవత్సరం సినిమాలు ఇప్పటికే లైన్ అప్ లో వున్నై వాటిల్లో మోస్ట్ ఎవైటింగ్ అంటే టాలీవుడ్- బాలీవుడ్ సూపర్ స్టార్స్ కలైకా లో వస్తున్న వార్2, శాండల్ వుడ్ నుండి వస్తున్న కాంతారా2
ఈ రెండు సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. ఒకవైపు కన్నడ ఇండస్ట్రీకి ఎంతో పేరు తెచ్చిన కాంతార ప్రీక్వెల్. ఈ సినిమా మొదటి భాగం కంటే అంతకుమించి అనేలా రెడీ అవుతోంది.
మరోవైపు హై వోల్టేజ్ కాంబినేషన్ తారక్ ( NTR )- హృతిక్ చేస్తున్న వార్ 2. ఈ సినిమా పై అంచనాలు రోజు రోజు కి పెరుగుతున్నాయి వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటిస్తున్న వార్ 2 నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక కాంతార గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి ఎక్సపెక్టషన్స్ లేకుండా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది తెలుగులో అయితే ఏకంగా 60 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది.
ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార: చాప్టర్ 1 కోసం దాదాపు గా 150 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. అయితే ఈ సినిమాను కూడా 2025 ఆగస్టు మధ్యలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే ‘వార్ 2’ కూడా 2025 ఆగస్టు 14న విడుదల అవుతుంది అని చిత్ర బృందం ప్రకటించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పైన తెలుగులో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే స్పై యూనివర్స్ అందులోనూ వార్ ఫ్రాంచైజ్ నార్త్ లో ఎలానూ పాపులర్ ఏ ఈసారి ఎన్టీఆర్ తోడు అవడం తో సౌత్ లోను సినిమా పైన ఫుల్ గా హైప్ క్రియేట్ అయింది.
Read Also : రౌడీ కేజీఎఫ్ అంట….
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే టైమ్ లో రిలీజ్ అయితే కత్చితంగా ఇబ్బందులు తప్పవు. రెండు చిత్రాల మొదటి నుంచి పెట్టుకున్న టార్గెట్ 1000 కోట్ల క్లబ్ లో చేరడమే. అలాంటప్పుడు ఈ టార్గెట్ అందుకోవాలంటే విడుదల తేదీల విషయంలో నిర్మాతలు మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఒకే రోజు వచ్చిన వారం గ్యాప్ లో వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో వస్తున్నాయి కనీసం నెల రోజులు గ్యాప్ లో విడుదల అయితే కలెక్షన్స్ చాలా మంచిదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
Follow us on Instagram