మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ దేవర తో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. వార్ 2 లో హృతిక్ రోషన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..
తమ్ముడు : నితిన్ సినిమాకు సరికొత్త అడ్డంకి.. కారణం అదేనా..?
’వార్ 2′ సినిమాతో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. అయాన్ ముఖర్జి ఈ సినిమాను తెరకెక్కించగా యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. ఆగస్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరి స్టార్ హీరోలతో సపరేట్గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. దీనితో ఏ ఈవెంట్లోనూ ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.. ‘
వార్ 2′ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఆ ఇద్దరు స్టార్ హీరోలు. అలాంటిది ఆ ఇద్దరినీ ఒకేసారి చూడాలంటే అది తెరపైనే చూడాలి. అంతే గానీ ప్రమోషన్స్‌లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరినీ ఒకే సారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది’ అని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం అనుకుంటోందని ఓ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘వార్ 2’ మూవీ నిలుస్తుంది.
