MOVIE NEWS

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట్లో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..

లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!!

వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ” వార్‌2 “. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.అయితే వారి ఎదురుచూపులకి తాజాగా మేకర్స్ పులిస్టాప్ పెట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ ‘వార్ 2’ మూవీ గురించి ప్రస్తావించాడు. దీనిపై సదరు నిర్మాణ సంస్థ స్పందిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది..

మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే అద్భుతంగా సెటప్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ పోస్ట్‌లో వారు తెలిపారు… దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. అయితే ఇటీవల డాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.. దీనితో వార్ 2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాదేమో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.. తాజాగా మేకర్స్ క్లారిటీ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా వున్నారు..

Related posts

ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!

murali

డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..?

murali

తన డ్రీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్న నాని..!!

murali

Leave a Comment