MOVIE NEWS

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

కథ ఏంటో గెస్ చేయండి.. బైక్ గెలుచుకోండి.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్..!!

దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు. మొదట ముంబైలో మొదలైన ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి భారీ లొకేషన్లలో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతున్నట్లు సమాచారం..

రీసెంట్ గా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు..ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న  గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులు కూడా ఈ సినిమా వాయిదా పడుతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ మూవీ టీం నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, సినిమాని షెడ్యూల్ చేసిన విధంగానే ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నామని, షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు..

 

Related posts

“కాంచన 4” మొదలెట్టిన లారెన్స్.. ఈ సారి మరింత కొత్తగా..!!

murali

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

murali

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

Leave a Comment