MOVIE NEWS

‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించి దూసుకుపోతున్నాడు.. వరుస సూపర్ హిట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు..తన నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే బిగ్గెస్ట్ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

తలైవా సినిమాలో నందమూరి నట సింహం.. దాదాపు ఫిక్స్ అయినట్లే..?

ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎన్టీఆర్ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వస్తాయి. అదే హిట్ టాక్ వస్తే కనుక కలెక్షన్ జాతర ఎవరు ఊహించలేరు. గతంలో ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ వార్ 2 తెలుగు రైట్స్ ను కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. నాగవంశీ స్వతహాగా ఎన్టీఆర్ ఫ్యాన్ అవడంతో ఈ వార్త బాగా వైరల్ అయింది.. అయితే ఈ విషయమై నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ ‘ తారక్ అన్న అభిమానులందరికీ నా విన్నపం వార్ 2 మూవీ తెలుగు హక్కులను నేను కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. మా ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైనా అధికారికంగా మా స్వంత హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది, దయచేసి బయట వినిపించే వార్తలను నమ్మకండి’ అని ఆయన తెలిపారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగవంశీతో పాటు ఏషియన్ సునీల్ కూడా వార్ 2 రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది.. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

Related posts

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

murali

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

“ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment