MOVIE NEWS

వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..రొటీన్ కథ కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కించాడు.. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, అనిరుధ్ మాస్ బిజిఎం మూలంగా ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఇదిలా ఉంటే దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’..

‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..?

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కి బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దీంతో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల సమాచారం . ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరితో అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందనే, దాని పై ఓ అంచనాకు రావాలంటే ఫస్ట్ లుక్ వచ్చి తీరాల్సిందే.ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది..ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ సాలిడ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్‌ను రివీల్‌ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్‌ 2 టీజర్‌ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రాహ్మస్త్ర దర్శకుడు అయిన అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Related posts

సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!!

murali

నేను ఏ తప్పు చేయలేదు..అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!!

murali

Leave a Comment