MOVIE NEWS

వార్ 2 : శివరాత్రికి బిగ్ అప్డేట్..మాస్ టీజర్ వచ్చేస్తుంది..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!!

దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..

దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..వాలెంటైన్స్ డే రోజున ఎదో ఒక అప్డేట్ వస్తుందని వారు ఆశించారు కాని రాలేదు..శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..రాబోయే టీజర్ విజువల్ ఫీస్ట్ గా ఉండనున్నట్లు సమాచారం..

 

Related posts

కాంతార తో వార్ అయేటట్లుందే

filmybowl

ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

murali

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

murali

Leave a Comment