MOVIE NEWS

విశ్వంభర : మేకర్స్ పై అసహనం వ్యక్తం చేసిన మెగాస్టార్.. కారణం అదేనా..?

మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. అయితే రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్” సినిమా కోసం ఈ సినిమాని వాయిదా వేశారు.అలాగే ఈ సినిమాను వాయిదా వేసేందుకు మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్…

కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది.. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి టీం పని చేస్తోంది.అంజి తర్వాత చిరంజీవి కెరీర్ లో వస్తున్న సోషల్ ఫాంటసి సినిమా ఇదే కావడం విశేషం..

ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది… అయితే ఈ సినిమా అవుట్ పుట్ చూసి చిరంజీవి అంత సంతృప్తిగా లేడు అని సమాచారం. తనకు కథ చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్.. అవుట్ పుట్ చూసినప్పుడు రాలేదు అని దర్శక నిర్మాతలపై చిరంజీవి అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది

Related posts

పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!!

murali

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..?

murali

దృశ్యం – ది కంక్లూషన్

filmybowl

Leave a Comment