మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచారు.. దీనితో ఈసారి భారీ హిట్ అందుకోవాలని మెగాస్టార్ భావిస్తున్నారు.. డానికి అనుగుణంగానే యంగ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. గతంలో “ బింబిసారా “ వంటి బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ తీసిన వశిష్ఠ భారీ హిట్ అందుకున్నాడు..ఇప్పుడు మెగాస్టార్ తో అంతకు మించి విజువల్స్ తో భా..రీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. “విశ్వంభర” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
మరోసారి ఆ వీడియో షేర్ చేస్తున్న నెటిజన్స్.. బన్నీ పరువు తీస్తున్నారుగా..!!
రొటీన్ కథలతో విసిగిపోయిన మెగాస్టార్.. అందుకే ఈసారి కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలని వశిష్టతో “విశ్వంభర”సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాను చిరు బ్లాక్ బస్టర్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరితో ఫ్యాన్స్ పోల్చుకుంటున్నారు.విశ్వంభర సినిమా గ్లింప్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు వశిష్ట.అయితే ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు.కానీ సంక్రాంతికి చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ సినిమా వాయిదా వేశారు. అంతేకాదు సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా పూర్తి కాకపోవడంతో వాయిదా వేయక తప్పలేదు..
విశ్వంభర వచ్చే ఏడాది సమ్మర్ కి వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం చిరు విశ్వంభర మూవీ సమ్మర్ కి సైతం కష్టమే అని తెలుస్తుంది.. సినిమాను కచ్చితంగా ఫెస్టివల్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. సంక్రాంతి తరువాత మరో బిగ్ ఫెస్టివల్ అయిన దసరాకి ఈ సినిమా రిలీజ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం..