MOVIE NEWS

విశ్వంభర : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే న గ్రాండ్ రిలీజ్..?

మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ రిలీజ్ డేట్ వర్క్ ఔట్ కాలేదు..

ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది.. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి టీం పని చేస్తోంది… ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది…అయితే ఈ సినిమాను ఆగస్టు నెలలో గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ స్పెషల్ డేనే ఆయన సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఎం. ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..

Related posts

AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..?

murali

సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

filmybowl

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

murali

Leave a Comment