టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ అందించాడు.. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో వున్న కళ్యాణ్ రాం బింబిసార సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. బింబిసార సూపర్ హిట్ కావడంతో వశిష్ఠ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది..వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.వీరి కాంబోలో “విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది..యూవి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..
నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!!
అయితే గతంలో రిలీజ్ చేసిన విశ్వంభర టీజర్ ఫ్యాన్స్ కు అంచనాలను అందుకోలేక పోయింది..పూర్ వీఎఫ్ఎక్స్కు తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ కూడా వాయిదా పడటం ఓటీటీ డీల్ కూడా సెట్ కాలేదన్న న్యూస్ విశ్వంభరపై ప్రేక్షకులలో బజ్ తగ్గించేసింది. అనిల్ రావిపూడితో మెగాస్టార్ చేస్తున్న 157 మూవీ సూపర్ బజ్ తో దూసుకెళుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని పరిస్థితి.మెగా 157 ముందు విశ్వంభరకు ఉన్న బజ్ తేలిపోతుండటంతో చిత్ర యూనిట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపనుంది.
గోదారి గట్టుమీద రామచిలుకవే అంటూ అందర్ని ఉర్రూతలూగించిన భీమ్స్.. మరోసారి చిరంజీవి కోసం మాస్ మసాలాను సిద్ధం చేస్తన్నాడట. అది కూడా రీమిక్స్ సాంగ్ అని టాక్ నడుస్తోంది. విశ్వంభరకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఓ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నాడట ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. చిరంజీవి క్లాసిక్ సాంగ్ అయిన అన్నయ్య మూవీలోని ఆట కావాలా, పాట కావాలా సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్ ఈ సాంగ్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే కనుక ఇప్పటి వరకు తన పాటలు ఇతర హీరోలు రీమిక్స్ చేయగా.. ఫస్ట్ టైం మెగాస్టారే తన పాటను రీమిక్స్ చేసుకుంటున్నట్లు అవుతుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం..
