Vishwambara teaser : మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వంశి – ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర.
Vishwambara teaser సంక్రాంతి కి రిలీజ్ చేద్దామని చిత్రబృందం అనుకున్నప్పటికి అనివార్య కారణం వల్ల సినిమా వేసవికి వాయిదా పడింది.
దసరా కానుకగా చిత్రబృందం టీజర్ రిలీజ్ చేసింది. ఎలా వుండో తెలుసుకుందాం పదండి.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఆ అంచనలని టీజర్ తోనే అందుకుంది అని చెప్పాలి
ఒక విపత్తు ని కాపాడటంకి హీరో ఎప్పుడు ముందే ఉంటాడు. ఆ హీరో గా రుద్ర పాత్రలో మెగా స్టార్ కనిపించారు రెక్కల గుర్రం మీద హీరో ఎంట్రీ అబ్బుర పరిచింది. ఆ తర్వాత చూపిన విజువల్స్ సినిమా ఎంత గ్రాండియర్ గా వుండబోతుందో తెలియజేసారు
Read Also : Allu Arjun Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…
టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేసిన దర్శకుడు విజువల్స్ కూడా అద్భుతంగా చూపించారు.
చిరు గురించి చెప్పేదేముంది. ఈ ఏజ్ లో కూడా ఆ స్వాగ్ ఎక్కడ తగ్గలేదు. చివరిలో ఆంజనేయ స్వామి ముందు పవర్ ఫుల్ గా నుంచొని శత్రువుల్ని ఊచ కోత కోస్తుంటే అభిమానులకి పండగే. మొత్తానికి టీజర్ సూపర్ అనే చెప్పాలి.
ఈ సినిమా ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధం అవుతుంది.
Follow us on Instagram