MOVIE NEWS

ఊసే లేని ‘విశ్వంభర’.. వశిష్ఠ అప్డేట్ ఎక్కడ..?

మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. కానీ టీజర్ రిలీజయ్యాక ఈ సినిమా పరిస్థితి వేరే లా మారింది…టీజర్ లో విజువల్స్, వీఎఫెక్స్ చాలా పూర్‌గా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫెక్స్ మీద మళ్లీ కొత్తగా పని చేయడం మొదలుపెట్టారు.వీఎఫ్ఎక్స్ కారణంగా సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమా కాస్త వాయిదా పడిపోయింది. వేసవిలో అయినా సినిమా రిలీజవుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.

భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!!

కొన్ని నెలలుగా సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు..ఇంతలో చిరు అనిల్ రావిపూడితో సినిమా కూడా మొదలుపెట్టారు.తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. షూటింగ్ మొదలు కాబోతున్న సందర్భంగా ప్రమోషనల్ గ్లింప్స్ కూడా వదిలారు. గ్లింప్స్ మెగా ఫ్యాన్స్ కి బాగా నచ్చింది.దీనితో ఈ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ అయింది. అయితే వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర పరిస్థితి ఏంటి అని మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.. ఈ సినిమాను చిరు పక్కన పెట్టేశారని.. అనిల్ సినిమానే పూర్తి చేసి ముందు రిలీజ్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే అనిల్ సినిమా ప్రారంభోత్సవంలో వశిష్ఠ కూడా పాల్గొన్నాడు. దీనితో విశ్వంభర సినిమా పూర్తి కావొస్తుందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ రానున్నట్లు సమాచారం..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన సీనియర్ క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..

 

Related posts

ప్రభాస్ స్పిరిట్ కోసం సంధీప్ రెడ్డి వంగ 500 కోట్ల భారీ బడ్జెట్.

filmybowl

హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!!

murali

‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment