MOVIE NEWS

విశ్వంభర : కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..ఫ్యాన్స్ ఒత్తిడే కారణమా..?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.. దీనితో ఈ సారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మెగాస్టార్ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.”విశ్వంభర” అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను “బింబిసార” ఫేమ్ వశిష్ట భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు..

బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఈ సినిమా మొదలయిన కొన్ని రోజులకి మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసారు.. ఆ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..అయితే అన్నీ కుదిరి ఉంటే ఈ జనవరి 10న విశ్వంభర హంగామా ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో మేకర్స్ కాస్త వెనకడుగు వేశారు. మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ పరంగా వచ్చిన కామెంట్స్ పై మేకర్స్ దిద్దు బాటు చర్యలు చేపట్టారు.

గతంలో వర్క్ చేసిన గ్రాఫికల్ టీం ని తీసేసి కొత్త టీం ని సెట్ చేసినట్టుగా సమాచారం. దీనితో కొంచెం బెటర్ గా వుండే విజువల్స్ ని వీరు అందిస్తారని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.. నిజానికి టీజర్ లో మరీ అంత నెగిటివ్ చేసే రేంజ్ లో విజువల్స్ లేవు కానీ సోషల్ మీడియాలో పెరిగిన నెగిటివిటీ కారణంగా మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ముందే మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు..మెగాస్టార్ ఈ సినిమాతో అయినా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటారో లేదో చూడాలి..

Related posts

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

తన వైల్డ్ స్టోరీతో మెగాస్టార్ నే భయపెట్టిన సందీప్ వంగా..!!

murali

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

Leave a Comment