రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కింగ్డమ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ కి హిందీలో రన్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్య, తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా కింగ్డమ్ సినిమా రూపొందుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!!
అయితే తెలుగు టీజర్ విడుదలై 12 రోజులు గడిచింది. ఇప్పటిదాకా వచ్సిన వ్యూస్ 15 మిలియన్లు.. అయితే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ టీజర్ కేవలం ఒక్క రోజులోనే 17 మిలియన్ల వ్యూస్ దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కింగ్ డమ్ మీద సితార సంస్థ వంద కోట్లకు పైనే బడ్జెట్ పెడుతోంది. ఇంకా ప్రమోషన్ల కోసం మరింత ఖర్చు పెడుతుంది..కానీ హిట్ 3 ది థర్డ్ కేస్ బడ్జెట్ ఆ సినిమా బడ్జెట్ లో సగం కూడా ఉండదు..కింగ్డమ్ టీజర్ ఎక్కువ రీచ్ తెచ్చుకోలేకపోవడానికి గల కారణాలు వున్నాయి..
జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్,అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజయ్ దేవరకొండ ఎప్పుడూ చూడని వయొలెంట్ మేకోవర్ ఇన్ని పాజిటివ్ అంశాలు వున్నా కింగ్డమ్ ఇంకా పాతిక మిలియన్లు చేరలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది . రిపీట్ మోడ్ లో చూడాలనిపించే స్థాయిలో విజువల్స్ లేకపోవడం, కథను దాచే క్రమంలో టీం పడిన పాట్లు స్పష్టంగా కనిపించింది.
గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామా రెండు భాగాలుగా ఉంటుందని గతంలో చెప్పారు కానీ టీజర్ లో అలాంటి హింట్ మాత్రం ఇవ్వలేదు. మే 30 న ఈ సినిమా రిలీజ్ కానుంది.హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది..