కొత్త విద్య నేర్చుకోడం లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ
( Vijay devarakonda latest film )
Vijay devarakonda latest film : విజయ్ దేవరకొండ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వం లో ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడా సినిమా ముగింపు దశకి చేరుకోడం తో వెంటనే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నాడు.
శ్యామ్ సింగ రాయి తో మంచి ప్రతిభ వున్నా దర్శకుడి గా పేరు తెచ్చుకున్న రాహుల్ తో విజయ తన తదుపరి చిత్రాన్ని చేసే పని లో ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఈ సినిమా ఉంటుందని తెలియచేసారు.
పీరియాడిక్ యాక్షన్ నేపధ్యం లో నడిచే ఈ చిత్రం నవంబర్ నుంచి షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపధ్యం లో ఈ సినిమా కథ కు సంబంధించి విజయ్ సరికొత్త విద్యని నేర్చుకుంటున్నాడని సమాచారం.
Read Also : మిస్టర్ ఇడియట్ ట్రైలర్ రిలీజ్
యుద్ధ నేపధ్యం లో సాగే సినిమా కావడం తో బాడీ బిల్డింగ్ తో పాటు గా , గుర్రపుస్వారీ , కత్తి యుద్దాల ట్రైనింగ్ నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఈ చిత్ర కథ వ శతాబ్దం తో పాటు గా వర్తమానం కాలం తో కూడా ఎం ముడిపడి ఉండనుంది అని సమాచారం. దానికి తగ్గట్టుగానే మన దేవరకొండ రెండు విభిన్న కోణాల్లో మన ముందుకు రానున్నాడు. ఈ సినెమా కోసం విజయ్ తొలి సారి రాయలసీమ యాస లో మాట్లాడనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో దర్శక నిర్మాతలు బిజీ గా ఉన్నారు. విజయ్ కి ఈ సినిమా తో మంచి విజయం లభించాలని కోరుకుందాం
Follow us on Instagram