MOVIE NEWS

ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ జోరుగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఖరారైనట్లు సమాచారం.

ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!!

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి కథా చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వెంకటేశ్ మరియు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి….

గతంలో వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ వెంకటేశ్‌ను మళ్లీ చూడనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related posts

మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!!

murali

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. ఓజీ తరువాత మరిన్ని సినిమాలు..?

murali

ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..?

murali

Leave a Comment