టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు.. యంగ్.దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెంకటేష్ తన కెరీర్‌లో నే భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న వెంకీ మామ, తన తదుపరి సినిమాను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
మళ్ళీ అలాంటి స్లాంగ్ లోనే వస్తున్న రాంచరణ్ మూవీ..?
ప్రస్తుతం వెంకటేష్ వరుస కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా, నిర్మాత సురేష్ బాబును సైతం ఎంతగానో మెప్పించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. హరీష్ శంకర్ వెంకటేష్ మూవీ దాదాపు ఖరారు అయినట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది..
హరీష్ శంకర్ కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ పడి చాలా కాలమే అయింది..రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి హరీష్ డిజాస్టార్‌ను అందుకున్నాడు. దీనితో వెంకటేష్ తో చేసే మూవీ తో మళ్ళీ ఫామ్ లోకి రావాలని హరిష్ శంకర్ చూస్తున్నాడు..అలాగే హరీష్ శంకర్ వెంకీ మాతో పాటు బాలయ్య తో కూడా ఓ భారీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది..త్వరలోనే దీనికి సంబందించి ఆఫీసియల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది..