MOVIE NEWS

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్ గా అదరగొడుతున్నారు.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న అన్‌స్టాపబుల్ షో ప్రస్తుతం నాలుగు సీజన్ తో దూసుకుపోతుంది .. హోస్ట్ గా బాలయ్య ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.. షోలో గెస్ట్ లుగా వచ్చిన ప్రతి స్టార్ ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు..అలాగే తన స్టైల్ ఆఫ్ కామెడీతో బాలయ్య ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు..

ఇదిలా ఉంటే సంక్రాంతి హీరోగా బాలయ్య కి వున్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సంక్రాంతి సీజన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సాధించి సంక్రాంతి హీరోగా బాలయ్య గుర్తింపు పొందారు.. వచ్చే ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ గా బాలయ్య రాబోతున్నాడు..యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అయితే ఈ సంక్రాంతికి బాలయ్యకి పోటీగా మరో సీనియర్ స్టార్ కూడా రంగంలోకి దిగితున్నాడు.. అతనే మన వెంకీ మామ.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాతో వెంకీ మామ సంక్రాంతి బరిలోకి దిగనున్నారు..

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

ఇదిలా ఉంటే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి నేడు సంక్రాంతికి వస్తున్నాం స్టార్స్ వచ్చారు.. హీరో వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి కూడా ఈ షో కి వచ్చారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీమామ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు. ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి షో చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేయగా తాజాగా చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ కి బాలయ్య గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వెంకటేష్ తొడకొడితే, బాలయ్య వెంకీ ఆసనం వేశారు. ఇక ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Related posts

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!!

murali

Leave a Comment