MOVIE NEWS

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

2024 ఏడాది ముగింపుకు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. బాబీ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!!

ఈ సంక్రాంతికి వస్తున్న మరో బిగ్ హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం’.. పండగకు వెంకీ మామ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయి చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా ఈ సాంగ్‌ ఎవరు పాడుతున్నారో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక వీడియో రూపంలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు.అయితే, ఇప్పుడు సాంగ్‌ ప్రోమో విడుదల కావడంతో నెట్టింట బాగా వైరల్‌ అవుతుంది.

ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్‌ మళ్ళీ పాడటం. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ అందించిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి సాంగ్‌ను డిసెంబరు 30న మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌ నటించారు. వెంకటేశ్‌ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి నటించారు..’దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్‌ కానుంది.

Related posts

బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..?

murali

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

murali

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

murali

Leave a Comment