MOVIE NEWS

ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”.. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించగా వెంకటేష్ భార్య గా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి గా మీనాక్షి చౌదరి నటించారు.

SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి భారీ సినిమాలున్నా కానీ వెంకీ మామ “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ అసలైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 50 కోట్లతో రూపొందిన ఈ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ దాదాపు రూ.300కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. గత నాలుగు వారాలుగా హౌస్ ఫుల్ షోస్ తో థియేటర్స్ లో సందడి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. త్వరలో ‘జీ’ తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘జీ’ ఎక్స్ వేదికగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి రాకముందే టెలివిజన్ లోకి రానుండటం విశేషం. టీవీల్లో ప్రసారమయ్యే డేట్ మాత్రం జీ 5 రివీల్ చేయలేదు. త్వరలోనే బుల్లి తెర ప్రసార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

 

Related posts

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!!

murali

Leave a Comment