పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు వహిస్తూనే తన లైనప్ లో వున్న భారీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.. పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు”.. ఈ సినిమా మొదలయి చాలా కాలమే అయింది.. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా వున్న క్రిష్ ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ చేసినా కానీ సినిమా ఆలస్యం అవుతూ వస్తుందటంతో సినిమా నుంచి తప్పుకున్నారు.. దీనితో ఈ సినిమా మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నాడు..
బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..అయితే ఈ సినిమాను మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ గతంలో ప్రకటించారు.. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడుతుందని అంతా భావించారు కానీ నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు..తాజాగా నిర్మాణ సంస్థ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు..ఈ రోజు హోలీ మరియు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్ తో పాటు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
మే 9 న ఈ సినిమా మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ థియేటర్లకు తీసుకొస్తున్నట్టు మేకర్స్ తెలిపారు..ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.మొత్తానికి పవర్ స్టార్ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..అలాగే ఈ సినిమా పూర్తి కాగానే పవన్ “ ఓజీ” సినిమాను పూర్తి చేయనున్నాడు..