MOVIE NEWS

VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ బిగ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తరువాత ఆ రేంజ్ హిట్ లేని విజయ్ ప్రస్తుతం తన లైనప్ లో భారీ సినిమాలను ఫిక్స్ చేసుకున్నాడు.. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ తన 12 వ సినిమా చేస్తున్నాడు. “ VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

మరోసారి అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ మూవీ.. ఫ్యాన్స్ కి పండగే..!!

తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 12వ తేదీన “VD 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు ఒక్కోభాషలో ఒక్కో స్టార్ హీరోతో ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇప్పించారు..తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా విజయ్ దేవరకొండ ఆయనతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. నిన్నంతా తారక్ అన్నతోనే గడిపాను. జీవితం, కాలం, సినిమా గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాం. టీజర్ డబ్ చేస్తున్నప్పుడు కూర్చుని, దానికి ప్రాణం పోసుకోవడం చూసి అతను నాలాగే ఉత్సాహంగా ఉన్నాడు. ధన్యవాదాలు తారక్ అన్నా, మీ పిచ్చిని మా ప్రపంచానికి తీసుకువచ్చినందుకు అని విజయ్ రాసుకొచ్చాడు.

అలాగే ఈ సినిమా హిందీ టీజర్ కు రణ్ బీర్ కపూర్, తమిళ్ టీజర్ స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ టీజర్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు..

 

Related posts

ఇట్స్ మీనాక్షి టైం

filmybowl

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

murali

ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!

murali

Leave a Comment