MOVIE NEWS

VD 12 : విజయ్ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ కి పండగే..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పెళ్లి చూపులు సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఆ సినిమా తరువాత రౌడీ హీరోగా తన కంటూ సెపెరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.. ఆ తరువాత వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ క్రేజ్ పీక్స్ కి చేరింది.. అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ విజయ్ హీరోగా తెరకెక్కించిన “లైగర్” సినిమా ఘోరంగా ప్లాప్ అయింది.. ఆ తరువాత వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు విజయ్ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.. దీనితో విజయ్ దేవరకొండ ట్రాక్ మార్చాడు.. కథా బలం వున్న సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడు అందులో భాగంగా ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

‘VD 12” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు..అయితే తాజాగా ఫ్యాన్స్ ఊహలకు అందని అప్డేట్ ఒకటి లీక్ అయ్యింది.

అదేంటి అంటే విజయ్ దేవరకొండ సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ చాలా స్పెషల్ అనిపిస్తుందట. విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తన బెస్ట్ పెర్ఫార్మన్స్ చూపించనున్నట్లు సమాచారం.అంతేకాదు ఈ సినిమాను నిర్మాత రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు మేకర్స్ తెలిపారు..

 

Related posts

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

murali

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment