MOVIE NEWS

వర్షం : రీ రిలీజ్ కు సిద్దమైన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న హీరో.. ప్రభాస్ ఈ రేంజ్ కి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు.. సినిమా సినిమాకి నటనలో వైవిధ్యం చూపుతూ వచ్చారు.. ప్రభాస్ తన మొదటి మూవీ ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు సపోర్ట్ తో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు..అయితే ప్రభాస్ నటించిన మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు…సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయింది..ప్రభాస్ హీరోగా,ఎస్ రాజు నిర్మాతగా, శోభన్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ సినిమా సెట్ అయింది..ఆ సినిమానే ‘’వర్షం “.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించింది..

Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..?

ప్రభాస్ హీరోగా ఒక లవ్ అండ్ యాక్షన్ మూవీ తీద్దాం అని మేకర్స్ ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు మ్యూజిక్ సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా వర్షం మూవీ పాటలే వినిపించేవి. దీనితో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 2004 సంక్రాంతికి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

అప్పటికే బాలయ్య నటించిన లక్ష్మి నరసింహ, చిరంజీవి గారి అంజి సినిమా రెండూ సిద్ధంగా ఉన్నాయి.అయినా కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను రిలీజ్ చేసారు.. అనుకున్నట్లు గానే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరో అయ్యారు.. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను మరో సారి రీ రిలీజ్ చేయనున్నారు..మే 23 న ఈ సినిమా 4k లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Related posts

దేవర రికార్డుల ఊచకోత మొదలు

filmybowl

పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!!

murali

ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!!

murali

Leave a Comment