Vamsi Paidipally to direct Mr.Perfect hero
MOVIE NEWS

వంశీ పైడిపల్లి తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా

Vamsi Paidipally to direct Mr.Perfect hero
Vamsi Paidipally to direct Mr.Perfect hero

Vamsi Paidipally Direct Mr.Perfect : వంశీ పైడిపల్లి తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా…. అని ఈ టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగులో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ని వంశీ ఏమి రీమేక్ చేయట్లేదు , తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్ యాక్టర్స్ అయినటువంటి ప్రభాస్ ( Prabhas ) , అల్లుఅర్జున్ ( Allu Arjun ) తో వంశీ కొత్త సినిమా స్టార్ట్ చేయడం లేదు. ఇదంతా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గురించీ. ఇంకా అర్ధం కాలేదా సరే చదివి తెలుసుకోండి.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ I Amir Khan ) తో మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి ( Vamsi Paidipally ) సినిమా దాదాపుగా ఖారారు అయినట్టు తెలుస్తుంది.

సౌత్ సినిమాకి నార్త్ ఆడియన్స్ దెగ్గర ఎలా గిరాకి పెరిగిందో. సౌత్ డైరెక్టర్స్ కి కూడా నార్త్ సూపర్ స్టార్స్ దెగ్గర అంత కంటే ఎక్కువే గిరాకి పెరిగింది.

తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎందరో దర్శకులు బాలీవుడ్‌లో వాళ్ళ సత్తా చాటుతుండటంతో, ఇప్పుడు మరో సౌత్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఆయన అడుగులు అటు వైపే వేస్తున్నారు.

టాలీవుడ్‌లో హిట్ చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, తన “వారసుడు” చిత్రం తో కోలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబు ( Mahesh Babu ) , విజయ్ ( Thalapathy Vijay ) తో సినిమాలు చేస్తాడని వార్తలు వచ్చినప్పటికి ఏదీ పట్టాలెక్కలేదు.

అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్న వంశీ ఈసారి బాలీవుడ్‌లో తన అడుగు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలే తమిళ సూపర్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ “జవాన్”తో షారుఖ్ కి సంచలన విజయం అందించాడు అలాగే సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) కూడా “కబీర్ సింగ్”తో షాహిద్ కి అనిమల్ తో రణబీర్ కి ఘనవిజయాలు కూడబెట్టాడు..

ఈ క్రమంలో తెలుగు దర్శకుల మీద బాలీవుడ్ హీరోలకు బాగా గురి కుదిరింది. బాలీవుడ్‌లో సౌత్ ఇండియన్ సినిమాలకి రోజు రోజు కి అభిమానులు పెరుగుతుండటంతో, వంశీ కూడా బాలీవుడ్‌ వైపు వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నాడు.

Read Also : ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది…

వంశీ పైడిపల్లి బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్స్ ఐన రణవీర్, రణబీర్ లతో కథ చర్చలు జరిపినట్లు ఆ మధ్య బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో వంశీ ప్రాజెక్ట్ దాదాపుగా పట్టాలెక్కబోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇది గనక నిజమైతే, ఈ ప్రాజెక్ట్ వంశీ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా అవుతుంది అనడం లో సందేహం లేదు.

అమీర్ ఖాన్ కి సౌత్ ఇండియన్ దర్శకుల తో పని చేయడం కొత్తేమి కాదు. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే మురుగదాస్ దర్శకత్వంలో “గజిని” సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు అప్పటికి తొలి 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరో గా సంచలనాలు నమోదు చేసాడు. అదే ఊపు లో ప్రస్తుతం వంశీ తో సినిమా చేయాలని ఆసక్తి గా ఉన్నాడని సమాచారం.

ఇక ఈ ప్రాజెక్ట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉంటాడని టాక్. వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ కొత్తేమీ కాదు. వంశి దర్శకత్వం వహించిన మున్నా, బృందావనం, ఎవడు, మహర్షి, వారసుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించింది రాజు ఏ, పైగా వంశి ని మున్నా సినిమా తో చిత్రసీమ కి పరిచయం చేసిందే రాజు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా దాదాపు రాజు ఏ పరిచయం చేస్తున్నట్టు అనుకోవాలి.

వంశీపైడిపల్లి ఇప్పటికే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ను, అమీర్‌కు వినిపించాడని ఆయనకు ఈ కథపై ఆసక్తి గా ఉన్నాడని సమాచారం.

ఆమిర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆఫీషియల్ గా ప్రకటన వస్తుంది. ఏదేమైనా మరో తెలుగు దర్శకుడు నార్త్ లో జెండా పాతాలని గట్టిగ కోరుకుందాం.

Follow us on Instagram

Related posts

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

murali

Leave a Comment