MOVIE NEWS

ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్..ముందుగా ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు… అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమాను ‘బేబీ జాన్‌’గా రీమేక్ చేయగా ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను సీన్ టూ సీన్ రీమేక్ చేయకూడదని నిర్ణయించుకున్నారు..

“వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాకి సంబంధించి అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..అయితే ఒక హీరోయిన్‌తోనే మొదలైన ఈ సినిమాలోకి ఇప్పుడు మరో హీరోయిన్ రంగంలోకి దిగింది. హీరోయిన్ ఒక్కరే అనుకున్న సమయంలో తేరి సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా కూడా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా కూడా తేరికి దగ్గరగానే ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒరిజినల్ సినిమాలో విజయ్ భార్య పాత్రలో సమంత నటించగా, టీచర్ పాత్రలో అమీ జాక్సన్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో రాశి ఖన్నా, టీచర్ పాత్రలో శ్రీ లీల నటించే అవకాశం ఉందని సమాచారం.. ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాయి..దీనితో ఫ్యాన్స్ సైతం దర్శకుడిని రీమేక్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు…

Related posts

స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

murali

ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..?

murali

బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment