MOVIE NEWS

ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!!

చాలా కాలం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఓజీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది., తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్యూట్ బ్యూటీ రాశీఖన్నా కూడా భాగమవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పెద్ది : చరణ్ మూవీ కోసం భారీ సెట్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరిందిగా..!!

ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా వ్యవహరిస్తుండగా, రాశీ ఖన్నా కూడా కథలో కీలక పాత్ర పోషిస్తూండటం సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది.ఇందులో భాగంగా చిత్ర యూనిట్ రాశీఖన్నా పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆమె “శ్లోక” అనే పాత్రలో ఒక ఫోటోగ్రాఫర్‌గా కనిపించనుంది. కాగా ఈ పోస్టర్‌తో ఆమె పాత్ర కథలో కీలకం కానుందనే టాక్ మొదలైంది. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు..ఆయన గతంలో పవన్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి..

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది..ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు..

Related posts

VD 12 : విజయ్ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ కి పండగే..!!

murali

“డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..!!

murali

ఆంధ్ర కింగ్ తాలూకా : రామ్ రాత.. అనిరుధ్ పాట.. ఫ్యాన్స్ కి పండగే..!!

murali

Leave a Comment