MOVIE NEWS

ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…

ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!!

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ “.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా హరీష్ శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు..

గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ “ శ్రీలీల “ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమా కు పవన్ కళ్యాణ్ ఏకంగా 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియాల్సి వుంది..

Related posts

ఇమాన్వి కోసం ప్రభాస్ స్పెషల్ క్యారేజ్. పోస్ట్ వైరల్..!!

murali

నాగావంశీ : ఆ సినిమాకు పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో నా ఛాయిస్ ఆయనకే..!!

murali

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

murali

Leave a Comment