మెగా హీరోలకు ఫ్యాన్స్ తో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఏదోకటి చేయాలని తాపత్రయ పడుతూ వుంటారు..అలాగే అభిమానులు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి వున్న మూమెంట్ చూస్తే ఎంతగానో ఆనందిస్తారు.తాజాగా మరోసారి అభిమానుల కోరిక తీరింది..పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ హార్ట్ఫుల్ మూమెంట్ చూసిన మెగా అభిమానులు ఆనందం లో మునిగిపోయారు.
సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలకు హీరోల కొరత..!
ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో.. ఫ్యాన్స్ సైతం వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తే చూడాలని వుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. చిరు, పవన్ ఇలా ఆత్మీయంగా కలవడంతో ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోతున్నారు..ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ఈ నెలలోనే హరిహర వీరమల్లు రిలీజ్ ఉండటంతో రిలీజ్ అయ్యే రోజు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ నెల 24 న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది..
అలాగే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న “ ఓజీ “ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది.. సెప్టెంబర్ 25 న ఓజీ ని మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్, పవన్ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి… ‘గబ్బర్ సింగ్’ ద్వారా బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ కలవడంతో మాస్ ప్రేక్షకుల్లో హైప్ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..
