MOVIE NEWS

Unstoppable with NBK : తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన వెంకీ మామ.. వీడియో వైరల్..!!

నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలు చేస్తూనే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షోకి హోస్ట్ గా అదరగొడుతున్నారు.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా నాలుగో సీజన్ తో సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది..తాజాగా నేడు ఈ షో ఏడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వచ్చి సందడి చేశారు.ఇద్దరు స్టార్ హీరోలు ఒకే షో లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు సురేష్ బాబు అలాగే అనిల్ రావిపూడి కూడా వచ్చారు.తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..?

ప్రోమోలో వెంకటేష్ తన కూతుళ్ళ గురించి అలాగే నాగ చైతన్య గురించి కూడా మాట్లాడారు. అలాగే బాలయ్య – వెంకటేష్ ఒకరి డైలాగ్స్ ఒకరు చెప్పడంతో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ సందడి చేసారు..నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అన్నదమ్ములు ఇద్దరూ రావడంతో వారి తండ్రి దివంగత స్టార్ నిర్మాత రామానాయుడు గురించి బాలయ్య అడిగారు.ఈ క్రమంలో నాన్న గురించి మాట్లాడుతూ సురేష్ బాబు, వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు.

వెంకటేష్ మాట్లాడుతూ .. అవి నాన్న చివరి రోజులు.. నేను ఎంతో బాధపడ్డాను. ఏదో ఒకటి చేసి ఉంటే బాగుండేది అనిపించిందని అన్నారు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే వెంకీమామ ఎమోషనల్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Related posts

తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా …

murali

హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!!

murali

నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

murali

Leave a Comment